దేశ వైద్యవిద్య రంగంలో తెలంగాణ వేదికగా సరికొత్త రికార్డు నమోదైంది. ఒకే రోజు తొమ్మిది ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రారంభం అయ్యాయి. రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, జయశంకర్ భూపాలపల్లి, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, వికారాబాద్, జనగాం జిల్లాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీల తరగతులను ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి
@KTRBRS పాల్గొన్నారు. అనంతరం వైద్య విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు.
